సాయిదుర్గా తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన దాదాపు రెండున్నరేళ్లు కేటాయించారు.

పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేక మేకోవర్ చేసుకున్నారు. లాంగ్ హెయిర్, గడ్డం, ఫిట్‌నెస్‌తో కొత్త లుక్‌లో కనిపించారు.

తాజాగా షూటింగ్ పూర్తవడంతో, ఆ పాత్ర నుంచి బయటకొచ్చి కొత్త లుక్‌ను విడుదల చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ కొత్త రూపాన్ని అభిమానులకు చూపించారు.

'విరూపాక్ష' విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న సాయిదుర్గా తేజ్, తన కెరీర్‌లో మరో విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

త్వరలో ఈ సినిమా ప్రమోషన్లు ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.