తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలు జరుగుతున్నాయని అన్నారు. స్వేచ్ఛగా నామినేషన్లు వేసే వాతావరణం లేదని, అన్ని చోట్ల టీడీపీ గూండాలు బరితెగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తనకు అసలు ఎన్నికలు ఎందుకు అనిపిస్తోందని సజ్జల తెలిపారు.

చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పోలీసులే దాడులు చేస్తున్నారని, దీనికి ఎన్నికలు ఎందుకుని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి ఎన్నికలంటే భయమని సజ్జల అన్నారు.