కర్నూలు జిల్లాలో కృష్ణానది జలాల నుంచి సంగమేశ్వర ఆలయం శనివారం పూర్తిగా బయటపడింది. ఆగస్టు 6న జలదిగ్బంధంలోకి వెళ్ళిన ఆలయం రెండు నెలల తర్వాత భక్తులకు దర్శనమిస్తోంది.

శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరడంతో ఆలయం మునిగిపోయింది. జూలై నెలలో ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పెరిగింది.

వరద నీరు తగ్గడంతో ఆలయం బయటపడింది. దసరా నుంచి భక్తులకు శివయ్య దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దసరా తొలిపూజకు ఆలయం సిద్ధంగా ఉంది. భక్తులు యథావిధిగా శివయ్యను దర్శించుకోవచ్చు.