పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ఈరోజు క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు, 24వ ర్యాంకర్ అయిన తైవాన్ క్రీడాకారిణి చియు పిన్-చియాన్‌తో తలపడనుంది. ముఖాముఖి పోరులో సింధుదే 1-0 ఆధిక్యం.
ఇక్కడిదాకా ఇలా
- మొదటి రౌండ్: థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిడా కటెథాంగ్‌పై 21-14, 8-21, 23-21తో 64 నిమిషాల్లో గెలుపు
- ప్రీ క్వార్టర్స్: జపాన్‌కు చెందిన రికో గుంజిపై 21-12, 21-16తో 44 నిమిషాల్లో గెలుపు
ఈ ఏడాది సింధు క్వార్టర్ ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి.
ఇద్దరు భారత అమ్మాయిలు
అస్సాంకు చెందిన అష్మితా చలిహా కూడా క్వార్టర్స్ చేరింది. ప్రీ క్వార్టర్స్‌లో ఆమె మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అకానె యమగుచిని 21-19, 21-18తో ఓడించింది. క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరతో ఆడనుంది. ఒక సూపర్ 750 టోర్నీలో ఇద్దరు భారత మహిళలు క్వార్టర్స్ చేరడం 2019 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ఇదే మొదటిసారి. అప్పుడు సైనా నెహ్వాల్, సింధు క్వార్టర్స్ చేరారు.
మరోవైపు తన్వీ శర్మ ప్రీ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ అన్ సె యంగ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి గాయం కారణంగా రెండో రౌండ్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు.




