రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సింధు స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయం ఆమెకు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.

ఈ సందర్భంగా ఇనయత్ భాషా, పీ.డీ స్వరూప మెడల్ ప్రధానం చేశారు. సింధు సాధించిన విజయం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జాతీయస్థాయి జూడో పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు సింధు ఎంపిక కావడం విశేషం.

జాతీయ స్థాయిలో కూడా పాల్గొని రాష్ట్రానికి, ఊరికి, పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని హెచ్.ఎం. సుమన ఆకాంక్షించారు.

క్రీడల పట్ల పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానోపాధ్యాయురాలు సుమన, ఉపాధ్యాయ బృందం హామీ ఇచ్చారు.

ఈ విజయం సింధుకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పాఠశాల వర్గాలు తెలిపాయి.