నల్లనేలపై కార్మికలోకం గర్జించింది. కోల్‌బెల్ట్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్మికులతో గోదావరిఖనిలోని జేఎల్‌ఎన్ స్టేడియం కిక్కిరిసిపోయింది. దీంతో ఎటుచూసినా జాతరను తలపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే నల్లనేలపై బుధవారం సమరభేరి మోగింది. సింగరేణి భద్రత, కార్మికుల భవిష్యత్తు కోసం బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ విజయవంతమైంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం కార్మికుల్లో చైతన్యం నింపింది. కాంగ్రెస్ సర్కార్ ప్రలోభాలకు తలొగ్గకుండా కార్మికులు భారీగా తరలివచ్చారు, బీఆర్‌ఎస్ పార్టీ, టీబీజీకేఎస్‌పై వారికున్న తరగని అభిమానాన్ని చాటుకున్నారు.
సింగరేణి కార్మిక గర్జన విజయవంతం: కేటీఆర్ సమరభేరి
నల్లనేలపై కార్మికలోకం గర్జించింది, కోల్‌బెల్ట్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. సింగరేణి భద్రత, కార్మికుల భవిష్యత్తు కోసం బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ విజయవంతమైంది.
రాజకీయాలుమూలం: Namasthe Telangana
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



