డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ ఈరోజు పూర్తయింది.

హైదరాబాద్‌లో జరిగిన చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం ముగిసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది.

పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌లు ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే విడుదలైంది.

‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.