రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన నీటి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సీతక్కను సభ్యురాలిగా నియమించారు.
ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, దీనితో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడటంపై దృష్టి సారించారు.
నీటి లభ్యతను పరిశీలించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. భూగర్భ జల మట్టాలను పెంచడానికి, వర్షపు నీటిని సేకరించడానికి రీఛార్జ్ పిట్లు, వ్యవసాయ చెరువులు, ఇంకుడు గుంతల నిర్మాణం, వాటి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుంది. సంబంధిత శాఖలకు సూచనలు ఇస్తుంది. ప్రభుత్వానికి తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, వాకిటి శ్రీహరి కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.



