నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గాయపడిన విద్యార్థులను యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
శనివారం ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన డాండియా వేడుకల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ ఆర్చ్ ఒక్కసారిగా కూలిపోయింది.
ఈ ప్రమాదంలో మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థిని నారాయణదాసు సోనా (18) మరణించింది. ఈ ఘటనలో మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు.
మరణించిన విద్యార్థిని సోదరి మీనా కూడా ఈ ప్రమాదంలో గాయపడింది. ఆమెకు కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.



