తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు 49 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ పదవికి, వివిధ వార్డులకు ఈ నామినేషన్లు స్వీకరించారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు.
ఈ భద్రతా ఏర్పాట్లలో ఆరుగురు ఎస్ఐలు, 57 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వీరికి తోడు ప్రత్యేక పార్టీ బలగాలను కూడా మోహరించారు.
పోలీసులు అడుగడుగునా అప్రమత్తంగా ఉంటూ నిఘా పెట్టారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



