అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై బుధవారం సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేసిన తుది జాబితాను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై ఈ ఉత్తర్వులు వచ్చాయి. నామినేషన్ల గడువు పొడిగించాలని కోరుతూ వైసీపీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహన్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూధ్రా, ముఖుల్ రోహత్గీ వాధించారు.
నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు, విజ్ఞప్తులపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది.
నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల కోసం సమయం పొడిగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పోటీ చేసేందుకు కనీసం 48 గంటల గడువు కల్పించాలని స్పష్టం చేసింది.
నామినేషన్లు వేయలేని వారి కోసం ఏం చేయాలనే దానిపై అక్టోబర్ 22వ తేదీలోగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది.



