దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని తనిష్క్ యూఎస్ఏ యాజమాన్యం డబ్లిన్ నగరంలో ‘‘డబ్లిన్ ట్రంక్ షో’’ను నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక ప్రదర్శన అక్టోబర్ 24, 25 తేదీల్లో జరుగుతుంది.
ఈ ట్రంక్ షో డబుల్ట్రీ బై హిల్టన్ కొలంబస్ డబ్లిన్, 600 మెట్రో ప్లేస్ ఎన్, డబ్లిన్, ఓహెచ్ 43017 వద్ద ఏర్పాటు చేశారు. ప్రదర్శన ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
తనిష్క్ యాజమాన్యం ఈ డబ్లిన్ ట్రంక్ షోకు అందరినీ ఆహ్వానిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా తనిష్క్ యూఎస్ఏ బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై, డైమండ్ ఆభరణాల విలువపై 25 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. పండుగ షాపింగ్ చేసే వారికి ఇది మంచి అవకాశం.



