విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పూర్తి మద్దతు ప్రకటించింది. రాధాను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

కొద్ది రోజులుగా రాధా అభ్యర్థిత్వంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా సాగుతున్న ప్రచారాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

టీడీపీ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. రాధాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందరూ చూస్తున్నారని టీడీపీ తెలిపింది. ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా కూటమి అభ్యర్థినే గెలిపించుకుందామని పిలుపునిచ్చింది.

కులతత్వం రెచ్చగొట్టేవారికి బుద్ధి చెప్పాలని టీడీపీ కూటమి ప్రజలను కోరింది. కూటమి గెలుపుతో విజయవాడను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.