పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవిని జనసేనకు కేటాయించడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి దారితీసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ అందించిన ఈ మున్సిపాలిటీలో కూటమి సర్దుబాటులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవేదనకు లోనయ్యారు. సాలూరులో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ పరిస్థితిని భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.

పార్టీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అధిష్ఠానం పునరాలోచన చేసేలా కృషి చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడిని సంధ్యారాణి అభ్యర్థించారు.

ఎస్టీ ఎమ్మెల్యేను గెలిపించేందుకు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఇక్కడి టీడీపీ నేతలు, బీసీలకు అన్యాయం జరిగిందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.