ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూటమికి ఏకగ్రీవం అయ్యాయి. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఊహించని పరిస్థితి ఎదురైంది. నగరి మున్సిపాలిటీని టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.

ఛైర్‌పర్సన్‌ పదవికి మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీ నుంచి మూడు నామినేషన్లు ఉండగా, వైఎస్సార్‌సీపీ నుంచి 10 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత టీడీపీకి ఏకగ్రీవం లభించింది. ఈ ఫలితం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.