టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న శనివారం కొల్లాపూర్ పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని తీన్మార్ మల్లన్న అన్నారు. త్వరలోనే కాలం మారుతుందని, అధిక జనభా ఉన్న బలహీన వర్గాల ప్రజల ఓట్లతో గద్దెనెక్కుతామని ఆయన చెప్పారు.
కొల్లాపూర్ నియోజకవర్గానికి చరిత్ర ఉందని, ఇక్కడ రెండుసార్లు బీసీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారని మల్లన్న గుర్తు చేశారు.
కొల్లాపూర్ పర్యటనలో భాగంగా ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర కొల్లాపూర్ పట్టణానికి చేరుకుంది.



