తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ, మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయదశమి పండుగ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది.
రాబోయే వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. బీసీ నేత డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. పార్టీ తరఫున డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పోటీ చేస్తారని ఆమె వెల్లడించారు.
ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ కో-ఆర్డినేటర్, అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్‌ను నియమిస్తూ తక్షణ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈ నియామకాన్ని ప్రకటించారు.



