దసరా శుక్రవారం తిరుమల కొండను ఉదయం నుండి నల్లటి మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం 2:30 నుండి 3:30 గంటల వరకు భారీ వర్షం కురిసింది.
ఉదయం మోహినీ అవతార వాహన సేవకు వచ్చిన భక్తులు సాయంత్రం గరుడ సేవను తిలకించడం కోసం గ్యాలరీలలోనే కూర్చుండిపోయారు.
అయితే, మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా గ్యాలరీలలోని భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా అక్కడే ఉండిపోయారు.
భారీ వర్షం వల్ల గరుడ సేవకు కొంత ఆటంకం కలిగింది. భక్తులు వర్షంలోనే సేవను వీక్షించేందుకు వేచి ఉన్నారు.



