ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ స్థానం కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించారు. అయితే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ మాదవి పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా, ఎమ్మెల్యే శ్రీనివాస్ సొంతంగా నాగ శ్రావణి పేరును ప్రకటించారు. ఈ పరిణామం కూటమిలో కలకలం రేపింది.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆదివారం నామినేషన్ వేసే కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై ఇప్పటికే పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీలకు చెందిన నాయకులే తిరుగుబాటు చేయడం కూటమికి తలనొప్పిగా మారింది.



