బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అక్టోబర్ 18, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. నెక్లెస్ రోడ్ పరిసరాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి.
పండగ వేడుకలకు వచ్చే ప్రజలు, వాహనదారులు పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.



