హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల అతీక్ష్ గుప్తా జూనియర్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఓపెనింగ్ బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్ అయిన అతీక్ష్ మాసబ్‌ట్యాంక్‌లోని అర్షద్ అయూబ్ క్రికెట్ అకాడమీలో కోచ్ ఇమ్రాన్ ఖాన్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. అత్తాపూర్‌లోని ఎడిఫై వరల్డ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు.
రెండు నెలల్లో 17 ఇన్నింగ్స్
గత రెండు నెలల్లో అండర్-12, అండర్-14 టోర్నీల్లో ఆడిన 17 ఇన్నింగ్స్‌లో అతడి స్కోర్లు: 101*, 36*, 7, 56*, 101*, 60*, 41, 22, 16*, 17, 30, 30, 94*, 15, 43*, 54*, 57. ఇందులో రెండు అజేయ సెంచరీలు ఉన్నాయి. (* నాటౌట్)
ఇప్పటివరకు 130 మ్యాచ్‌ల్లో 1,700 పరుగులు, 63 వికెట్లు సాధించాడు. ఆడిన తొలి అధికారిక మ్యాచ్‌లోనే 9 పరుగులకు 5 వికెట్లు తీసి 'బెస్ట్ బౌలర్' అవార్డు అందుకున్నాడు.
లక్ష్యం తెలంగాణ, ఆ తర్వాత భారత్
నాలుగేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి మ్యాచ్‌లు చూస్తూ క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఎంఎస్ ధోనీ అంటే అతడికి ఇష్టం. వచ్చే మూడేళ్లలో ఆటను, ఫిట్నెస్ను మెరుగుపరుచుకుని తెలంగాణకు, ఆ తర్వాత భారత్‌కు ఆడాలన్నది అతడి లక్ష్యం. 2021లో ఎఫ్‌సీ బార్సిలోనా జూనియర్ వర్చువల్ మస్కట్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 10 మంది చిన్నారుల్లో అతీక్ష్ ఒకడు.




