మహిళల క్రికెట్ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు ఆంధ్రప్రదేశ్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆంధ్రప్రదేశ్ విఫలమైంది.

మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఓపెనర్ రియా భాటి 62 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించింది.

భారతి సింగ్ 25 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్లలో రిషిక పనాటి, సృష్టి శేఖర్, వడ్డే అక్షయ తలో రెండు వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదనలో ఆంధ్రప్రదేశ్ 135 పరుగులకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో 9.1 ఓవర్లలో 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విద్యాశ్రీ 45 పరుగులు, ధనశ్రీ రాజ్ 35 నాటౌట్ పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించారు. వారి పోరాటం సరిపోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఓటమి పాలైంది.