కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అక్టోబర్ 19, సోమవారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ ఆయుధ, వాహన, జమ్మి పూజలు నిర్వహించారు.

విజయదశమి అందరికీ విజయాలను చేకూర్చాలని, పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.