విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. పవిత్ర విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులు తెల్లవారుజాము 2:30 నిమిషాల నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

నేడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిస్తున్నారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

దసరా వేడుకల మహా పూర్ణాహుతి ఉదయం 10:30 నిమిషాలకు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంతో శరన్నవరాత్రి ఉత్సవాలు అధికారికంగా ముగుస్తాయి.

ఇంద్రకీలాద్రిపై తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు భక్తుల సందర్శనతో కళకళలాడాయి. ప్రతి రోజు అమ్మవారు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.