విష్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘కల్ట్’ చిత్రం అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకుంది. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్వక్ సేన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో కథానాయికగా నటించారు. ‘కల్ట్’ సినిమా థ్రిల్లింగ్గా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. అక్టోబరు చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.



