ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కాఫెడ్ మైదానంలో జరుగుతున్న వెంకటాపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. దసరా మహోత్సవం సందర్భంగా వెంకటాపురం క్రికెట్ అసోసియేషన్ ఈ పోటీలను నిర్వహిస్తోంది.

ఏడవ రోజు జరిగిన పోటీల్లో భాగంగా 'సేవ్ టు నో డ్రగ్' నినాదంతో ముందుకు సాగుతున్న విపిఎల్ సీజన్ 3లో శనివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్ ఏకే వారియర్స్, వైకింగ్ వారియర్స్ మధ్య జరిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వైకింగ్ వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఏకే వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది.

రెండో బ్యాటింగ్‌కు దిగిన వైకింగ్ వారియర్స్ 8.5 ఓవర్లలోనే 72 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇమ్రాన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

రెండో మ్యాచ్ హంటర్స్, స్టార్ లెవెల్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్టార్ లెవెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.