వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎంపీ పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని ఆమె తెలిపారు.
ఈ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని కడియం కావ్య అన్నారు. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడబిడ్డలు ఆటపాటలతో వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎంపీ తెలిపారు. ఈ పండుగ ద్వారా మన వారసత్వాన్ని కాపాడుకోవచ్చని ఆమె అన్నారు.



