స్థానిక ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అటు వైసీపీ సైతం తమ అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఈ పరిణామాల మధ్య జనసేనకు సీట్ల కేటాయింపుపై ఒక మహిళా మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటన టీడీపీ, జనసేన కేడర్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనను వేగవంతం చేశాయి.



