తెలంగాణలో మహిళా ఉద్యోగులు అక్టోబర్ 18న కొత్త బతుకమ్మ పాటతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిన తీరును ఈ పాటలో వర్ణించారు. 'గద్దెనెకినాడే ఉయ్యాలో ఇచ్చిన హామీలు ఉయ్యాలో, తుంగలో తొకినాడే ఉయ్యాలో' అంటూ పాటలో పేర్కొన్నారు.

డీఏలు రావాలంటే దసరాలు రావాలి అంటూ ఉద్యోగులు తమ ఆవేదనను బతుకమ్మ పాట ద్వారా తెలియజేశారు. ఈ నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని వారు ఆరోపించారు.