ఢిల్లీలో నిరసనల సందర్భంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్ నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న మహిళలను లైంగికంగా వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ సంఘాలు గురుద్వారా బంగ్లా సాహిబ్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించాయి. ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని నిరసనకారులు కదం తొక్కారు.
నిరసనకారులు 'మీరు మమ్మల్ని భయపెట్టగలరేమో కానీ.. మమ్మల్ని మౌనంగా ఉంచలేరు' అని నినాదాలు చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
మహిళా సంఘాల ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. నిందితులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన వారిని శిక్షించాలని మహిళా సంఘాలు కోరాయి. అక్టోబర్ 17న ఈ నిరసనలు జరిగాయి.



