ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో సంస్కరణలు అవసరమని వైఎస్ జగన్ అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేసే ప్రస్తుత విధానం మారాలని ఆయన సూచించారు.
ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీని ఎంపిక చేసే పద్ధతి ఉండాలని జగన్ ప్రతిపాదించారు.
వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెరగాలంటే నియామకాలు ఒక నిర్దిష్ట విధానం ప్రకారం జరగాలని ఆయన నొక్కి చెప్పారు.
గతంలో ఒక సీఈసీ ప్రతిపాదనకు తాము అంగీకరించడం తప్పేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.



