మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజున వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు హత్య చేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించారు.
పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందని వైఎస్ జగన్ తెలిపారు. రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయం, వాహనాలకు నిప్పు పెట్టారని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి, ధర్మవరం, కడపలో నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారని వైఎస్ జగన్ వెల్లడించారు. దాచేపల్లిలో తమ అభ్యర్థి నామినేషన్ వేయకుండా నిర్బంధించారని ఆయన ఆరోపించారు.
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కొన్ని చోట్ల ఈ దౌర్జన్యాల్లో పోలీసులు భాగస్వాములుగా కూడా మారారని ఆయన ఆరోపించారు.
తమ విధులు నిర్వర్తించని పోలీసులు చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం క్రూరంగా దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర బలగాలతో నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.



