పిడుగురాళ్లలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ అబ్దుల్లా నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. నిర్ణీత సమయానికి 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
షేక్ అబ్దుల్లా చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లగా, ఎన్నికల అధికారి నామినేషన్ స్వీకరించేందుకు నిరాకరించారు.
ఆలస్యం కారణంగా నామినేషన్ తిరస్కరణకు గురవడంతో షేక్ అబ్దుల్లాకు నిరాశ ఎదురైంది.
నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన ఎన్నికల అధికారిని కోరారు.



