మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ భూమా నరసింహ రెడ్డిని పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

డాక్టర్ భూమా నరసింహ రెడ్డి గిద్దలూరు ప్రజలకు సుపరిచితులు. ఆయన ఎన్నో ఏళ్లుగా ప్రైవేటు వైద్యశాల నడుపుతూ వైద్యుడిగా సేవలందిస్తున్నారు.

వైద్యుడిగా ఆయనకు గిద్దలూరులో మంచి పేరు ఉంది. ప్రజలతో ఆయనకు ఉన్న పరిచయాలు ఎన్నికల్లో కలిసివచ్చే అంశంగా పార్టీ భావిస్తోంది.

ఈ నిర్ణయంతో గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీ శ్రేణులు ఈ ప్రకటనతో ఉత్సాహంగా ఉన్నాయి.