
స్వామికి కిరీటం సరే… భక్తుడికి నీడ ఏది?
తిరుమల శ్రీవారికి చెన్నై దంపతులు సమర్పించిన రూ.208 కోట్ల ఆభరణాలు ఆలయ చరిత్రలోనే ఒక భక్తుడు ఇచ్చిన అతిపెద్ద కానుక. ఆ భక్తిని శంకించాల్సిన పనిలేదు. కానీ స్వామికి బంగారం ఇచ్చిన దాతకు దక్కే పేరుప్రఖ్యాతులు, భక్తులకు నీడ, అన్నం అందించే దాతకు దక్కడం లేదు. ఈ కానుక బయటపెట్టిన అసలు లోపం అదే.