శ్రీకాకుళం జిల్లా గారలో టైటానియం పార్కును ఏర్పాటు చేసేందుకు అదానీ సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.16 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

దేశీయ అవసరాలకు సరిపడా టైటానియం లోహాన్ని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న బీచ్‌శాండ్‌ ఖనిజ సంపదను ఈ ప్రణాళికలో భాగంగా వినియోగించుకోవాలని చూస్తోంది.

ఈ ప్రాజెక్టును అదానీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC)తో కలిసి చేపట్టనుంది. బీచ్‌శాండ్ ఖనిజాల వేరుచేత ప్లాంటును ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

అలాగే, వేరుచేసిన ఇలిమినైట్ ఖనిజాన్ని శుద్ధి చేసేందుకు వీలుగా వాల్యూ ఎడిషన్ ప్లాంట్లను కూడా నిర్మించాలని అదానీ సంస్థ ప్రతిపాదించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.