హైదరాబాద్, అక్టోబర్ 13: పండుగ సీజన్ నేపథ్యంలో అగర్‌బత్తీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ అర్జుణ్ రంగ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఎనిమిది యూనిట్లలో ఏడాదికి 1200 కోట్ల అగర్‌బత్తీలు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి మరో 5-7 శాతం వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అగర్బత్తీ ఉత్పత్తి పెంపు: పండుగ సీజన్‌కు అనుగుణంగా నిర్ణయం
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అగర్బత్తీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు కంపెనీ సీఈవో అర్జుణ్ రంగ తెలిపారు. హైదరాబాద్‌లోని యూనిట్ సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
వ్యాపారంమూలం: Namasthe Telangana
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



