ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తాడికొండ, రావెల మధ్య ఈ విమానాశ్రయం నిర్మాణం కానుంది. రాబోయే మూడు నెలల్లో ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయం 5,000 కోట్లతో ఏరోసిటీగా నిర్మాణం కానుంది.

ఈ ప్రాజెక్టు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో చేపట్టనున్నారు. విమానాశ్రయం కోసం ల్యాండ్ పూలింగ్ ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది. ఇది రాజధాని ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపడుతోంది.