ప్రస్తుతం అక్టోబర్ నెలలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉత్తర మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణ శాఖ తెలిపింది. 'వార్త తెలుగు' నివేదిక ప్రకారం, ఎల్ నినో ప్రభావం వల్ల వచ్చేది మరో ఎండాకాలం అని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 2 నెలల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.