బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సోమవారం వెల్లడించింది.

వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వేసవిని తలపిస్తున్నాయని శాఖ తెలిపింది.

ఈ సమయంలోనే ఏపీఎస్డీఎంఏ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఎనిమిది జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.