విజయవాడ / అమరావతి: 2025 జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్ - ఎఫ్ఏసీ) ఎస్. సురేష్ కుమార్ జీవో ఆర్టీ నం. 2213ను విడుదల చేశారు.
ఈ ప్రత్యేక జ్యూరీ కమిటీకి ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభలను ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనల మేరకు గవర్నర్ ఆదేశాలతో ఈ నియామకాలు జరిగాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి పరిపాలన, స్క్రీనింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజయవాడలోని APSFTVTDC ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.
2025 ఏడాదికి సంబంధించిన తెలుగు, ప్రాంతీయ చిత్రాల ఎంట్రీల పరిశీలన, స్క్రీనింగ్ కార్యక్రమాలను నూతన జ్యూరీ కమిటీ పర్యవేక్షించనుంది.



