ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) రాబోయే మూడు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
ఈ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
రామచంద్రపురం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్, వెల్దుర్తి, డోన్, గూటి, పొదిలి, బద్వేల్, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలు ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు, పిడుగుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దని ఏపీఎస్డీఎంఏ ప్రజలకు సూచించింది.

