ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండ తీవ్రత తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం రాష్ట్రంపై పడుతోంది. నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ద్రోణి కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ ద్రోణికి ఈశాన్య రుతుపవనాలు కూడా తోడవుతున్నాయి.