తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన ఛైర్మన్గా ప్రముఖ వ్యాపారవేత్త బెల్లం మాధవి బాధ్యతలు స్వీకరించారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో బెల్లం మాధవి నియామకం స్ఫూర్తిదాయకమని సినీ ప్రముఖులు కొనియాడారు. ఆమె నాయకత్వంలో ఛాంబర్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దసరా, సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ బెల్లం మాధవి సినీ ప్రముఖులకు సాదర స్వాగతం పలికారు. రానున్న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.



