హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ సినిమా పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా, శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్ద పండ్ల లోడుతో వెళ్తున్న లారీ ఆయన కారును వెనుక నుంచి ఢీకొట్టింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఉన్నారు. ఢీకొన్న తీవ్రతకు కారు వెనుక భాగం బాగా దెబ్బతింది. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని తొలుత వార్తలు రాగా, అందరం క్షేమంగా ఉన్నామని శేఖర్ మాస్టర్ ఆ తర్వాత ఓ వీడియో విడుదల చేశారు.
‘‘అయ్యప్ప స్వామి దయ వల్లే అందరం సురక్షితంగా బయటపడ్డాం’’ అని ఆయన అన్నారు. ఇటీవలే ఆయన అయ్యప్ప మాల ధరించారు. అదే రోజు రాత్రి మరో షూటింగ్కు వెళ్తున్నట్లు వీడియోలో చెప్పారు.
ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైనట్లు ఇంకా సమాచారం లేదు.



