హైదరాబాద్: తెలంగాణను పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో యువ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఇతరుల కంపెనీల్లో ఉద్యోగాలు చేయడానికే పరిమితం కాకుండా, సొంత సంస్థలను స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. హైటెక్ సిటీలో సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన బిజినెస్ సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో పెట్టుబడులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
తెలంగాణను పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
వ్యాపారంమూలం: V6 Velugu
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



