గ్లోబల్ టెస్టింగ్, ఇన్స్పెక్షన్, సర్టిఫికేషన్ సేవలు అందించే కోటెక్నా గ్రూప్, హైదరాబాద్‌లోని ఎనర్జాన్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది. ఎనర్జాన్ ల్యాబ్స్ ఫార్మా అనలిటికల్ టెస్టింగ్ సేవలు అందిస్తుంది.
ఈ ల్యాబ్ అమెరికా ప్లాంట్ల స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ కొనుగోలుతో ఔషధాలు, బయోఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ప్యాకేజింగ్ నాణ్యత పరీక్షించే సేవలు మరింత పెరుగుతాయి.
ప్రపంచ ఫార్మా రంగంలో భారత్ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక్కడ తమ కార్యకలాపాలను పెంచుకోవడానికి, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన పరీక్షలు అందించడానికి ఈ కొనుగోలు ఉపయోగపడుతుందని కోటెక్నా ప్రతినిధులు తెలిపారు.
భారత ఫార్మా మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి, అన్ని రకాల ఫార్మా టెస్టింగ్ సేవలు అందించడానికి ఈ ఒప్పందం చాలా ముఖ్యమని కోటెక్నా గ్రూప్ సీఈఓ సెబాస్టియన్ డన్నాడ్ చెప్పారు.
ఈ ఒప్పందం వల్ల భారతీయ ఫార్మా కంపెనీలకు సాంకేతిక సహకారం అందుతుంది. దీనితో వారు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు వేగంగా, నమ్మకంగా ఎగుమతి చేయగలరని ఎనర్జాన్ ల్యాబ్స్ వెల్లడించింది.



