హైదరాబాద్‌లోని మలక్‌పేట రేస్‌కోర్స్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా జింక మాంసంతో పాటు తుపాకీ, బుల్లెట్లు లభించాయి. అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహీంద్రా స్కార్పియో వాహనాన్ని తనిఖీ చేయగా ఈ వస్తువులు బయటపడ్డాయి.
ఈ ఘటనకు సంబంధించి మలక్‌పేట పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్స్, ఆయుధాలు, ఇతర సామగ్రితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో లైసెన్స్ కలిగిన 30-06 స్పోర్టింగ్ రైఫిల్, 8 లైవ్ బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్‌లు ఉన్నాయి. వేటకు ఉపయోగించిన పలు పరికరాలు కూడా లభించాయి.
వాహనాల తనిఖీల్లో భాగంగా మహీంద్రా స్కార్పియో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లోనే జింక మాంసం, ఆయుధాలు బయటపడ్డాయి.