తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మారేగవ్‌లో ఒక రహస్య ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈగల్ ఫోర్స్ బృందం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తోంది. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి విస్తరించిన ఈ అక్రమ నెట్‌వర్క్‌ను ఛేదించింది.
మారేగవ్‌లోని రహస్య ల్యాబ్‌లో సింథటిక్ డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ఈ ల్యాబ్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు.
ఈ ఆపరేషన్‌లో సింథటిక్ డ్రగ్స్ తయారీ ముఠా వెనుక ఉన్న అక్రమ నెట్‌వర్క్‌ను కూడా పోలీసులు చేధించారు. దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోంది.