క్యాన్సర్‌ చికిత్సలో నూతన పద్ధతులను కనుగొనడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న భారత సంతతి వైద్యురాలు డాక్టర్ రచనా ష్రాఫ్‌ 47 ఏళ్ల వయసులో మరణించారు. ప్యాంక్రియాస్‌, పిత్తాశయ క్యాన్సర్ల చికిత్సలో ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

డాక్టర్ ష్రాఫ్‌కు క్యాన్సర్ ఉన్నప్పటికీ, ఆమె తన పరిశోధనలపై ఆశను కోల్పోలేదు. తనకు లభించని చికిత్సలు మరెందరికో అందుబాటులోకి రావాలని ఆమె తపించారు.

ఆమె తన చివరి రోజుల్లోనూ పరిశోధనలకు నిధులు సేకరించడంలో చురుకుగా పాల్గొన్నారు. యువ శాస్త్రవేత్తల కోసం రూ.11 కోట్లకుపైగా నిధులను సమీకరించారు.

అమెరికాలో క్యాన్సర్‌ పరిశోధన రంగంలో అంతర్జాతీయంగా పేరుగాంచిన డాక్టర్ రచనా ష్రాఫ్‌ జీవితం ఇప్పుడు అనేకమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.